SGSTV NEWS
CrimeTelangana

TG Crime : అమ్మ తర్వాత అమ్మ కదరా…అలా చేసావేంట్రా…అక్కను చంపిన తమ్ముడు


రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన రోహిత్ అనే యువకుడు తన అక్క రుచితను దారుణంగా హత్య చేసాడు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు




TG Crime : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన రోహిత్ అనే యువకుడు తన అక్క రుచితను దారుణంగా హత్య చేసాడు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం డిగ్రీ చదువుతున్న రుచిత అదే గ్రామానికి చెందిన దినేష్‌ అనే యువకుడితో చనువుగా ఉంటోంది. అయితే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని తల్లిదండ్రులు అనుమానించారు. అయితే భయంతో దినేషే తన వెంట పడుతున్నాడని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో గ్రామంలో పంచాయతీ నిర్వహించారు. మరోసారి రుచిత వెంటపడకూడదని దినేష్‌ను హెచ్చరించి వదిలేశారు. నాటి నుంచి దినేష్‌, రుచిత మధ్య మాటలు లేవు.  అయితే ఈరోజు సోమవారం ఉదయం రుచిత తల్లిదండ్రులు పనికి వెళ్లగా, ఇంట్లో రుచిత, ఆమె తమ్ముడు రోహిత్ మాత్రమే ఉన్నారు.
అది గమనించిన దినేష్‌ రుచిత ఒక్కతే ఉందనుకుని ఫోన్‌ చేశాడు. రుచిత మాట్లాడుతుండగా రోహిత్‌ గమనించాడు. అయితే అమ్మనాన్న వద్దన్న ఎందుకు మాట్లాడుతున్నావని రోహిత్‌ నిలదీశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా గొడవ జరిగింది. దీంతో ఆగ్రహాంతో ఊడిపోయిన రోహిత్‌ రుచిత గొంతు పిసికి ఆపై గొంతుకు వైరుబిగించి చంపినట్లు పోలీసులు తెలిపారు. అయితే రుచిత చనిపోవడంతో రోహిత్‌ ఇంటినుంచి పారిపోయాడు.

తల్లిదండ్రులు ఇంటికి వచ్చేప్పటికీ రుచిత విగతాజీవిగా పడి ఉండడంతో  తండ్రి దేశాల రాఘవేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు రోహిత్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. సీఐ నర్సింహా రావు దర్యాప్తు చేపట్టారు. తమ్ముడే అక్కను చంపాడా లేదా అన్నదానిపై పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడి కానున్నాయి. కాగా రోహిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రుచిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మరోవైపు రోహిత్ చదువు మానేసి ఇంట్లోనే ఉంటున్నాడని, జల్సాలకు అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసయ్యాడని గ్రామస్తులు అంటున్నారు.  ఇంట్లో తల్లిదండ్రులను, అక్కను తిడుతూ ఎప్పుడూ గొడవపడేవాడని చెప్తున్నారు.  రుచిత తల్లిదండ్రులు ఇంట్లో లేని సందర్భంలో రుచితను తిడుతూ కొడుతూ రోహిత్ పలుసార్లు అమానుషంగా ప్రవర్తించాడని ఆరోపిస్తున్నారు.

ఈ విషయంలో  ఎన్నిసార్లు చెప్పినా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని స్థానికులు చెబుతున్నారు. రుచితను కూడా ఆమె తమ్ముడు రోహిత్ చంపేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ ఇంట్లో కనిపించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.


Also read

Related posts