హైదరాబాద్: పాతబస్తీ బండ్లగూడలో నిన్న జరిగిన కార్ల వ్యాపారి అబ్దుల్ రహీం హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రియుడితో కలిసి అతని భార్యే… రహీంను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంటి నుంచే సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేసే మహ్మద్ అబ్దుల్ రహీం అలియాస్ బబ్బూ (45) బండ్లగూడ హైవే హోటల్ సమీపంలోని అబుబాకర్ కాలనీలో మొదటి అంతస్తులోని అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. భార్య షిరీన్ సుల్తానా, ఇద్దరు కుమారులు, కుమార్తె. తల్లి కూడా ఉంటున్నారు. గురువారం రాత్రి బంధువుల శుభకార్యానికి వెళ్లి వచ్చి నిద్రపోయాడు. ఉదయం 6.35 గంటల సమయంలో కుర్తా, తలకు టోపీ, మాస్కు ధరించిన ఓ వ్యక్తి రాగా షిరీన్ సుల్తానా తలుపు తీసింది. నేరుగా పడకగదిలోకి వెళ్లిన నిందితుడు తలుపు గడియ పెట్టి సుత్తితో కొట్టి చంపేసి వెళ్లిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. షిరీన్ సుల్తానా ఆమె ప్రియుడితో కలిసి రహీంను హత్య చేసినట్టు తేల్చారు. హత్య అనంతరం నిందితుడు బాల్కనీ నుంచి మరో ఇంటిపైకి దూకి పరారైన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మృతుడి భార్యపై అనుమానం వచ్చి పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఇద్దరూ కలిసి రహీంను హతమార్చినట్టు తేలింది.
Also read
- శ్రీరంగనాథుడి ఆలయంలోకి రానివ్వలేదు.. చివరకు అర్చకుడే భుజాలపై మోసుకెళ్లాడు!
- Hyderabad: డేటింగ్ యాప్‌లో పరిచయం.. కొమ్మా క్లబ్‌కు పిలిచి నిండా ముంచిన యువతి!
- తెలంగాణ ఈగల్ ఫోర్స్ దెబ్బ.. మహారాష్ట్రలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. కోట్ల విలువైన MD సీజ్!
- బెంగళూరులో నర్సింగ్ గ్రాడ్యుయేట్ మృతి.. ప్రియుడు అనుమానితుడు
- సంపన్న వైద్యుడినంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి వల.. పెళ్లి పేరుతో భారీ మోసం





