హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ నగదు దోపిడీ కలకలం రేపింది. మన్సూరాబాద్‌లోని చందేశ్వర్ కాలనీ రోడ్ నంబర్ 2లో ఉన్న ప్లాట్ నంబర్ 61లో నలుగురు గుర్తుతెలియని ముసుగు దొంగలు ఇంట్లోకి చొరబడి రూ.3.20 కోట్ల నగదును అపహరించారు.
ఈ ఘటన నేడు (శనివారం) మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న సామ మానమ్మ (65), ఆమె కోడలు మౌనిక చేతులను కట్టేసి, వారి నోటికి ప్లాస్టర్ వేసిన దుండగులు బెడ్రూమ్లోని బీరువాను బలవంతంగా పగులగొట్టారు. అనంతరం ఆ బీరువాలో ఉన్న భారీ నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
ఆస్ట్రేలియాలో ఉంటున్న కొమ్మరవెల్లి సంపత్ కుమార్ రెడ్డి స్థలం కొనుగోలు కోసం తన బావమరిది కుంభం విజయ్ కుమార్ రెడ్డి ఖాతాకు నగదు పంపించినట్లు సమాచారం. బంధువుల పెళ్లికి వెళ్లాల్సి ఉండటంతో ఈ నెల 22న విజయ్ కుమార్ రెడ్డి ఆ నగదును మన్సూరాబాద్‌లోని సామ ప్రవీణ్ ఇంట్లో భద్రపరిచినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
Also read
- శ్రీరంగనాథుడి ఆలయంలోకి రానివ్వలేదు.. చివరకు అర్చకుడే భుజాలపై మోసుకెళ్లాడు!
- Hyderabad: డేటింగ్ యాప్‌లో పరిచయం.. కొమ్మా క్లబ్‌కు పిలిచి నిండా ముంచిన యువతి!
- తెలంగాణ ఈగల్ ఫోర్స్ దెబ్బ.. మహారాష్ట్రలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. కోట్ల విలువైన MD సీజ్!
- బెంగళూరులో నర్సింగ్ గ్రాడ్యుయేట్ మృతి.. ప్రియుడు అనుమానితుడు
- సంపన్న వైద్యుడినంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి వల.. పెళ్లి పేరుతో భారీ మోసం





