బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా) : దంపతుల మధ్య వివాదాల కారణంగా భార్యను భర్త హత్య చేశాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని బూరుగుగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీకి చెందిన పండు సాయికిరణ్, బుట్టాయగూడెం మండలం బూరుగువాడ గ్రామానికి చెందిన గొడ్డ రేఖామాధురి నాలుగేళ్లుగా ప్రేమించుకుని ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నారు. రేఖామాధురి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో వారు రేఖామాధురి పుట్టింటికి వచ్చారు. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మళ్లీ వారిద్దరూ గొడవపడగా సాయికిరణ్ చున్నీతో రేఖామాధురి మెడను గట్టిగా లాగి హత్య చేశాడు. అనంతరం ఆమె తండ్రి శ్రీనుకు ఫోన్ చేసి ”మీ అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది” అని చెప్పాడు. ఇంటికి వచ్చిన కుటుంబీకులకు సాయికిరణే హత్య చేశాడని అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలవరం డిఎస్‌పి బి వెంకటేశ్వరరావు, జీలుగుమిల్లి సిఐ ఎం వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ దుర్గామహేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





