కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై కారు వేగంగా దూసుకెళ్లింది. దీంతో రెండు బైకులు, ఒక రిక్షా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై కారు వేగంగా దూసుకెళ్లింది. దీంతో రెండు బైకులు, ఒక రిక్షా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నవరం నుంచి జగ్గంపేటకు వెళ్తున్న పెళ్లికారు ఫ్రంట్ టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘటనాస్థలానికి చేరుకు ప్రమాదంపై ఆరాతీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించారు అధికారులను కోరారు
Also Read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





