నిజామాబాద్ జిల్లాలో అప్పు తీర్చేందుకు వినూత్నంగా మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కంకర రాళ్లకు బంగారం పూత పూసి వాటిని విలువైన బంగారు రాళ్లుగా నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లాలో అప్పు తీర్చేందుకు వినూత్నంగా మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కంకర రాళ్లకు బంగారం పూత పూసి వాటిని విలువైన బంగారు రాళ్లుగా నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీకి చెందిన రమేష్‌కు శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో రూ.1.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. చాలాకాలంగా అప్పు తిరిగి చెల్లించకపోవడంతో రమేష్ పలుమార్లు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో అప్పు తీర్చేందుకు మార్గం లేక శ్రీనివాస్ కొత్త కథ అల్లాడు. తనకు గుప్తనిధి దొరికిందని, అందులో బంగారు రాళ్లు లభించాయని, వాటిని అప్పుకు బదులుగా ఇస్తానని రమేష్‌ను నమ్మించాడు.
అంతేకాకుండా, ఆ బంగారు రాళ్లను తీసుకురావాలంటే డిచ్పల్లి మండలం ఘన్‌పూర్‌కు రావాలని, మరో రూ.32 వేల నగదు తీసుకురావాలని సూచించాడు. శ్రీనివాస్ మాటలు నమ్మిన రమేష్ అతను చెప్పిన ప్రదేశానికి వెళ్లి రూ.32 వేలు అందజేశాడు. అనంతరం శ్రీనివాస్ నాలుగు బంగారు రాళ్లుగా చెప్పిన వస్తువులను రమేష్‌కు ఇచ్చాడు. అయితే వాటిని పరిశీలింoచిన రమేష్‌కు అనుమానం రావడంతో దగ్గరగా పరిశీలించగా అవి అసలు బంగారం కాదని, సాధారణ కంకర రాళ్లపై బంగారం రంoగు పూత పూసినట్లు గుర్తించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన రమేష్ వెంటనే డిచ్పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శ్రీనివాస్‌ను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రజలు గుప్తనిధులు, బంగారు వస్తువుల పేరుతో చేసే ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





