తంగెళ్ళమూడి (ఏలూరు) : ‘మా బిడ్డను పోలీసులే చంపేశారు’ అని మరణించిన యశ్వంత్ అనే యువకుడి కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తూ … ఏలూరు జిల్లా ఆసుపత్రి వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు. ఏలూరులోని తంగెళ్ళమూడి లో బంగారు యశ్వంత్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏలూరు సిసిఎస్ పోలీసులు వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ జిల్లా ఆస్పత్రి వద్ద బంధువులు నిరసన చేపట్టారు. బైక్ల దొంగతనం కేసులో యశ్వంత్ ను అనుమానితుడిగా గత మూడు రోజుల క్రితం సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల నుంచి కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి సిసిఎస్ పోలీసులు తమ కుమారుడిని చిత్రహింసలకు గురి చేశారని బాధిత బంధువులు తెలిపారు. పోలీసులు దాడి చేయడం వల్లే తన కుమారుడు మృతి చెందాడని యువకుడి తల్లి కన్నీటిపర్యంతమయ్యింది. మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నట్లు బంధువులు తెలిపారు. యువకుడి శరీరంపై బలమైన గాయాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులే తమ బిడ్డను చంపేశారని కుటుంబీకులు, బంధువులు వాపోయారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





