గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రావిపాడుకు చెందిన కొల్లా సుబ్బాయమ్మ వయస్సు ఢెబ్బై ఐదు సంవత్సరాలు.. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదని ఆమె తమ్ముడు చనిపోయినట్లు కబురు వచ్చింది. దీంతో ఆమె కాకుమాను మండలం పాండ్రపాడు వెళ్లింది. అక్కడ తమ్ముడు అంత్యక్రియల్లో పాల్గొంది. ఆమె అదే రోజు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె మనమడు కొల్లా వెంకటేష్.. బంధువైన నాంచారమ్మకు ఫోన్ చేసి అడిగాడు. చిన్నదినం కూడా చూసుకుని వస్తుందిలే అని సమాధానం చెప్పారు. దీంతో సరేనంటూ వెంకటేష్ ఫోన్ పెట్టేశాడు. అయితే పదమూడో తేదిన వెంకటేష్ కు నాంచారామ్మ వద్ద నుండి ఫోన్ వచ్చింది. కొల్లా సుబ్బాయమ్మ కూడా మృతి చెందినట్లు నాంచారమ్మ చెప్పింది. దీంతో వెంకటేష్ గ్రామానికి వెళ్లి నాయనమ్మ మృతదేహాన్ని తమ స్వగ్రామమైన రావిపాడుకు తీసుకొచ్చారు. అక్కడ ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు.
అయితే ఇంత వరకు బాగానే ఉంది.. కానీ, ఆమె వంటిపై యాభై రెండు గ్రాముల బంగారు ఆభరణాలున్నట్లు వెంకటేష్ కు తెలిసింది. వాటి విలువ ఆరు లక్షల రూపాయలని బంధువులు చెప్పారు. బంగారు ఆభరణాల గురించి మొదట నాంచారమ్మకే ఫోన్ చేసి వెంకటేష్ అడిగాడు. అయితే ఆభరణాల గురించి తనకు తెలియదని చెప్పింది. ఇక చేసేదేమి లేక వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా సుబ్బాయమ్మ ఆభరణాలను తానే దొంగలించినట్లు నాంచారమ్మ ఒప్పుకుంది. ఆమె వద్ద నుండి రెండు చైన్లు, ఒక ఉంగరం, మంగళ సూత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుబ్బాయమ్మ మృతిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





