రాజానగరం: ప్రేమించానన్నాడు.. వంచించాడు.. పెళ్లి మాటెత్తితే కాదు పొమ్మన్నాడు. 16 ఏళ్ల బాలిక 18 బాలుడిపై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం రాజానగరంలో జరిగిన ఈ సంఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలు ఇలా వున్నాయి. రాజానగరానికి చెందిన ఆ మైనర్లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నరేంద్రపురం కూడలిలో జులాయిగా తిరిగే ఆ బాలుడు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకునే రోజుల నుంచి ఆమె వెంటపడేవాడు.
చివరకు తనతోనే లోకం అనేలా ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. పదో తరగతి వరకు చదివిన ఆ బాలిక పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో పెళ్లంటే తనకు ఇష్టం లేదని పొమ్మన్నాడు. దీనితో న్యాయం కోసం బాలిక స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరూ మైనర్లే కావడంతో పోలీసులు పోక్సో కేసుగా నమోదు చేసి, నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎస్సై నారాయణమ్మ దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





