వరంగల్: సుందరయ్య నగర్ లో నిత్య పెళ్లి కొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఒకరికి తెలియకుండా మరొకరిని మూడు వివాహాలు చేసుకున్న ఘనుడు.. మరో యువతితో తిరగడంపై మూడో పెళ్లికూతురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్కు చెందిన రాజేష్ హైదరాబాద్ లో కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఫిబ్రవరి 2022న నగరంలోని చార్ బౌలీకి చెందిన సుమన ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మే 2022న ఆంధ్రాకు చెందిన శ్రావణి హైదరాబాదులో రెండో పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల అనంతరం సుందరయ్య నగర్ కు వచ్చిన రాజేష్ సుందరయ్య నగర్ కు చెందిన సారికతో ప్రేమాయణం సాగించి 2024 ఫిబ్రవరిలో తీసుకెళ్లి హైదరాబాద్ ఆర్య సమాజంలో మూడో వివాహం చేసుకున్నాడు.
వీరి ముగ్గురిని వేరు వేరు చోట్ల అద్దెకు అద్దెకు ఉంచాడు. రాజేష్ ఇప్పుడు వీరి ముగ్గురిని కాదని కరుణ అనే యువతతో తిరుగుతుండడంతో నిన్న సుందరయ్య నగర్కు రావడంతో సారిక తల్లిదండ్రులు రాజేష్తో గొడవకు దిగడంతో వారి కళ్లు తప్పి రాజేష్ పరారయ్యాడు. సారిక తల్లిదండ్రులు రమణ్ 100కు కాల్ చేయగా ఇంతే జాగంజ్ పోలీస స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికి విడాకులు ఇవ్వకుండా తన కూతురిని మూడో పెళ్లి చేసుకున్న రాజేష్పా చర్యలు తీసుకొని తన కూతురి జీవితాన్ని కాపాడాలంటూ సారిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025