భార్య – భర్తల మధ్య గొడవలు పిల్లల ప్రాణం తీయటం చూశాం.. అత్తమామలను చంపిన కేసులు చదివాం.. ఇంకా ఎన్నో అఘాయిత్యాల గురించి తెలుసుకున్నాం.. కానీ పెంపుడు జంతువులను సైతం తమ కక్షలకు బలితీసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది. రోజూ లీటర్లకొద్దీ పాలు ఇచ్చే మూడు గేదెలను అత్యంత కిరాతకంగా నరికి చంపడం కలకలం రేపింది.
ఏలూరు: భార్య – భర్తల మధ్య గొడవలు పిల్లల ప్రాణం తీయటం చూశాం.. అత్తమామలను చంపిన కేసులు చదివాం.. ఇంకా ఎన్నో అఘాయిత్యాల గురించి తెలుసుకున్నాం.. కానీ పెంపుడు జంతువులను సైతం తమ కక్షలకు బలితీసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది. రోజూ లీటర్లకొద్దీ పాలు ఇచ్చే మూడు గేదెలను అత్యంత కిరాతకంగా నరికి చంపడం కలకలం రేపింది. గేదెల మకాంలో గేదెల మొండాలు వేరు వేరుగా పడివుండటం ఏలూరు జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఏడాది జూన్ 26న జరిగిన ఘటన అప్పట్లో అందరినీ భయాందోళనకు గురిచేసింది. ఇంతటి కిరాతకానికి ఎవరు పాల్పడి ఉంటారు. క్షుద్ర పూజల కోసం ఎవరైనా ఇలాంటి పని చేసి ఉంటారా అనే భయం ఆ ప్రాంత ప్రజల్లో కనిపించింది. కట్ చేస్తే, 5 నెలల తరువాత పోలీసులకు అసలు నిందితుడు దొరికాడు. నిందితుడు.. విచారణలో వెల్లడించిన నిజం విని పోలీసులే నివ్వెరపోయారు.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మటం గూడెంలో అత్యంత కిరాతకంగా.. మూడు గేదెలు తలలను నరికారు.. జూన్ 26 , 2025 న తెల్లవారుజామున ఈ ఘటన వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడిగా దాసరి రంగారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు కు చెందిన రంగారావు లారీడ్రైవర్ గా పనిచేస్తున్నాడు.. అతనికి తన భర్య సౌజన్యతో గొడవలు వచ్చాయి. దీంతో సౌజన్య తనభర్త రంగారావును వదిలి మటంగూడెం లోని తన బంధువుల ఇంటికి చేరుకుంది.
భర్తకు దూరమైన ఆమెను బంధువులు చేరదీసి ఆదరించారు. అయితే తన భర్య తనవద్దకు రాకపోవటానికి కారణం ఆమె బంధువులే అని నమ్మి వారిని భయబ్రాంతులకు గురిచేయడం, ఆర్థికంగా నష్ట పరచాలన్న ఉద్దేశంతో గేదెల తలలు నరికి వాటిని చంపేశాడు. ఇక లారీ డ్రైవర్ కావటంతో ఫోన్ వాడకుండా మహారాష్ట్రకు పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అయితే బాధితుడు తొర్లపాటి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎట్టకేలకు రంగారావును పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు.
ప్రాణం తీయటం తేలిక.. పోయటం చాలాకష్టం అంటారు. చిన్న చిన్న కారణాలతోనే దంపతుల మధ్య గొడవలు జరుగడం.. దీన్ని సాకుగా తీసుకుని కొందరు కన్నబిడ్డలతో సహా ఆత్మహత్యలకు పాల్పడటం లేదా చంపడం.. లాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. ఈ ఘటనల్లో అభంశుభంతెలియని చిన్నారులు .. కాల్మషం లేని పశువులు సైతం బలవుతున్న తీరు ఇపుడు చర్చనీయాంశంగా మారింది
Also Read
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
- నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





