కౌలాలంపూర్, ఏప్రిల్ 23: మలేసియాలో మంగళవారం (ఏప్రిల్ 23) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మలేషియా నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయి. ఈ ఘటలో 10 మంది నౌకాదళం సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సైనిక విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలేషియ పశ్చిమ రాష్ట్రమైన పెరాక్‌లోని లుముట్ నేవల్ బేస్ వద్ద మంగళవారం ఉదయం 9.32 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు నౌకాదళం తెలిపింది
మలేసియాలో వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 26) రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఈ క్రమంలో పెరక్‌లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్ నిర్వహించారు. ఈ క్రమంలో గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలాయి. వీటిల్లో విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్టేడియంలో కూలిపోగా, మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ఉన్న 10 మంది సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు ఉన్నారు. హెలికాప్టర్లు కూలిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రెండు హెలికాప్టర్లు కూలిపోయే ముందు ఛాపర్స్ రోటర్‌లో ఒకటి మరొకటి ఢీకొనడం వీడియో క్లిప్‌లో చూడొచ్చు. ఈ ఫుటేజీ వాస్తవమేనని స్థానిక పోలీసులు నిర్ధారించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడతామని నౌకాదళం తెలిపింది. మరణించిన సిబ్బంది గుర్తింపు ధృవీకరించడానికి మృతదేహాలను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరంతా 40 యేళ్లలోపు వారే
కాగా గత శనివారం జపాన్‌లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఆ రోజు అర్ధరాత్రి వేళ ప్రత్యేక శిక్షణ నిమిత్తం బయల్దేరిన రెండు నేవీ హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొని సముద్రంలో కూలిపోయాయి. ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో ఏడుగురు గల్లంతవగా ఇప్పటికీ వారి తెలియరాలేదు.
Also read
- Somanath Temple: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. రూ.25లకే సోమనాథుడికి బిల్వ పత్రం సమర్పించి రుద్రాక్షను పొందవచ్చు.. ఎలాగంటే..
- Navagrahas: నవగ్రహ ప్రదక్షిణ చేశాక కాళ్లు కడుక్కోవాలా?.. ఈ పొరపాట్లు చేయకండి..
- Telangana: కొడుకు కాదు.. కాలయముడు.. కాసుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు!
- నేటి జాతకములు..2 జూలై, 2025
- చెత్త లారీలో మృతదేహం.. వీడిన మిస్టరీ! షంషుద్దీన్తో ఏడాదిన్నరగా వివాహేతర బంధం.. ఆ తర్వాత