వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాదం చోటుచేసుకుంది. ఆర్మీ జవాన్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని సాంబ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న నాగరాజు.. అక్కడే తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. కుటుంబ కలహాలే జవాన్ ఆత్మహత్య కారణమని తెలుస్తోంది.
TG Jawan Suicide: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ నాగరాజు జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మూడు రోజుల క్రితం నాగరాజు విధుల్లో ఉండగానే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడరు. ఈరోజు ఉదయం ఆర్మీ అధికారులు నాగరాజు కుటుంబాన్ని అతడి ఫ్యామిలీకి అప్పగించారు.
జవాన్ ఆత్మహత్య..
జవాన్ నాగరాజు మృతితో నర్సంపేట గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ కలహాలే జవాన్ నాగరాజు మృతికి కారణమని తెలుస్తోంది. నాగరాజుకు రెండేళ్ల క్రితమే పెళ్లయింది. ప్రస్తుతం నాగరాజు ఆత్మహత్యకు కారణం ఏంటి? అనే దానిపై అతడి కుటుంబ సభ్యులు, భార్య నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మానసికంగా, శారీరకంగా ఎంతో దృడంగా ఉండే ఒక జవాన్.. ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు అంటున్నారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





