SGSTV NEWS
CrimeTelangana

TG Crime: నర్సులతో ఆపరేషన్‌.. కవల శిశువుల మృతి.. రంగారెడ్డిలో విషాదం


రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు గర్భవతికి ఆపేషన్‌ చేయగా.. కవల శిశువులు మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కవలలు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

TG Crime: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో  దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక విజయలక్ష్మి హాస్పిటల్‌లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు కవల శిశువులు ప్రాణాలు కోల్పోయారు. వెలిమినేడుకు చెందిన కీర్తి అనే మహిళ ఐదు నెలల గర్భిణిగా ఉంది. వైద్యుల సూచన మేరకు కవల గర్భధారణ నేపథ్యంలో గర్భ సంచికి స్టిచ్చింగ్ చేయించారు. అయితే.. కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమెకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మళ్లీ అదే ఆస్పత్రిని ఆశ్రయించారు. బాధితురాలికి తీవ్ర నొప్పులు రావడాన్ని గమనించిన బంధువులు తక్షణమే వైద్యం అందించాలని ఆస్పత్రి సిబ్బందిని కోరినప్పటికీ.. అక్కడి  ఆరు గంటల పాటు డాక్టర్లు ఏ ఒక్కరు అందుబాటులో లేరు.

వైద్యుల నిర్లక్ష్యం:
అత్యవసర పరిస్థితిలో డాక్టర్ ఫోన్ ద్వారా సూచనలు ఇస్తూ నర్సులను వైద్యం చేయమని చెప్పినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. శరీర పరిస్థితిని అంచనా వేయడంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్ల గర్భ సంచికి వేసిన స్టిచ్చింగ్ తెగిపోయింది. ఈ కారణంగా గర్భంలోని ఇద్దరు శిశువులు మృతి చెందారు. ఇది కీర్తి కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. బంధువులు ఈ దుర్ఘటనకు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.

తాము వైద్యం కోసం ఆస్పత్రికి చేరినా.. అక్కడి వైద్యుల వద్ద కనీసం ప్రాథమిక జాగ్రత్తలూ పాటించకపోవడం బాధాకరమని వారు చెబుతున్నారు. డాక్టర్ స్వయంగా హాజరుకాని పరిస్థితి, మరోవైపు తగిన చికిత్స లేకపోవడం రెండు కారణాల వల్లే ఈ విషాదకర ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి డిమాండ్ చేస్తున్నారు. గర్భిణి హెల్త్‌, మరోవైపు కవలలు మృతి చెందినందుకు తీవ్ర వేదన అనుభవిస్తున్నారని చెబుతున్నారు. బాధ్యత లేని వైద్య వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this