పెళ్లి అయిన మూడు రోజులకే వరుడు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్‌లో జరిగింది. బయ్యారం మండలానికి చెందిన నరేశ్‌కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈ నెల 18న వివాహం జరిగింది. ఇంట్లో బోరు మోటారు కోసం విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా నరేశ్‌కు షాక్ తగిలి మృతి చెందాడు
పారాణి ఆరక ముందే వరుడు మృతి చెందిన విషాద ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి అయ్యి రెండు రోజులు కాకుండానే వరుడు మృతి చెందిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారం మండలం కోడిపుంజుల తండాకి చెందిన ఇస్లావత్ నరేశ్‌కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈ నెల 18న వివాహం జరిగింది.
పెళ్లి జరిగి మూడు రోజులు పూర్తి కాకుండానే..
విజయవాడలో విహహం జరగ్గా రిసెప్షన్‌ను మంగళవారం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఈ సమయంలో ఇంట్లోని బోరు మోటారు కోసం విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా నరేశ్‌కు షాక్ తగిలింది. వెంటనే వరుడు అక్కడిక్కడే మృతి చెందగా.. వధువు జాహ్నవి తీవ్ర అస్వస్థతకు గురైంది.
వెంటనే ఆమెను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పెళ్లి జరిగిన సంతోషంలో కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ఇంట్లోనే ఉండగా ఈ విషాదం జరిగింది. దీంతో అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు. పారాణి ఇంకా ఆరక ముందే వరుడు మృతి చెందాడు.
Also read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..