*హైదరాబాద్ మాదన్నపేట:* హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
వీర్ సావర్కర్ నవ యువ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గా మాత విగ్రహ ఊరేగింపుపై గుర్తుతెలియని దుండగులు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఊరేగింపు ప్రశాంతంగా సాగుతున్న సమయంలో కొందరు దుండగులు ఈ దాడికి పాల్పడటంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు, పెద్ద ఎత్తున యువకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అనంతరం అక్కడే పెద్ద ఎత్తున భజనలు చేస్తూ, ధర్నాకు దిగారు. మత విశ్వాసాలను కించపరిచేలా వ్యవహరించిన నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న మాదన్నపేట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు…
Also read
- Hyderabad: ఫోటో చూసి అమాయకుడు అనుకోవద్దు.. ఇతని క్రైమ్ హిస్టరి తెలిస్తే..
- Hyderabad: 35కు పైగా కేసుల్లో నిందితుడు.. పరారీలో ఉన్న రౌడీషీటర్ అరెస్ట్
- బార్లో రివాల్వర్‌తో హల్చల్.. బిల్లు డబ్బులు ఇవ్వకపోతే కాల్చేస్తానంటూ..
- హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత – మాతా విగ్రహ ఊరేగింపుపై కోడిగుడ్లతో దాడి
- Kolhapur Gold Theft:మామ ఇంటో బంగారం చోరీ చేసి థార్ కొనుగోలు.. కారు పూజకు మామే చీఫ్ గెస్ట్!





