SGSTV NEWS online
CrimeNational

Kolhapur Gold Theft:మామ ఇంటో బంగారం చోరీ చేసి థార్ కొనుగోలు.. కారు పూజకు మామే చీఫ్ గెస్ట్!





Kolhapur Gold Theft: మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా ఓ దొంగతనం వైరల్ గా మారింది. మామ ఇంట్లో దొంగిలించిన నగలుతో కారు కొనుగోలు చేసి, ఆ కారు పూజకు మామనే ఆహ్వానించి షాక్ ఇచ్చాడు ఓ యువకుడు. కొల్హాపూర్ జిల్లా సాత్వే గ్రామంలో సమర్ పోపట్ చవాన్ అనే 19 ఏళ్ల యువకుడు తన మామ ఉమేష్ మారుతి చవాన్ ఇంటి నుంచి 15 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. వాటిని స్థానిక బంగారు ఆభరణాల వ్యాపారి సంగ్రామ్ బాబాసో మోరే సహాయంతో రూ. 10 లక్షలకు

Kolhapur Gold Theft: మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా

ఓ దొంగతనం వైరల్ గా మారింది. మామ ఇంట్లో

దొంగిలించిన నగలుతో కారు కొనుగోలు చేసి, ఆ కారు

పూజకు మామనే ఆహ్వానించి షాక్ ఇచ్చాడు ఓ యువకుడు.

కొల్హాపూర్ జిల్లా సాత్వే గ్రామంలో సమర్ పోపట్ చవాన్ అనే 19 ఏళ్ల యువకుడు తన మామ ఉమేష్ మారుతి చవాన్ ఇంటి నుంచి 15 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. వాటిని స్థానిక బంగారు ఆభరణాల వ్యాపారి సంగ్రామ్ బాబాసో మోరే సహాయంతో రూ. 10 లక్షలకు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వచ్చిన డబ్బులో మహీంద్రా థార్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు పూజా కార్యక్రమాన్ని తన మామనే ఆహ్వానించాడు.

కొత్త కారు పూజకు వెళ్లిన ఉమేష్, ఆ తర్వాత బంగారు ఆభరణాల కోసం వెతకగా అవి కనిపించలేదు. తన భార్యకు చెందిన నగలు పోయాయని గుర్తించిన ఉమేష్, అమ్మమ్మ ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయని గుర్తించారు. దీంతో కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు అనుమానించాడు.

దీంతో ఉమేష్ కొడోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

దర్యాప్తు సమయంలో సమర్ ఖరీదైన కారు కొనుగోలు చేయడంతో అనుమానం వ్యక్తమైంది. కొత్తగా ఇంత పెద్ద కారు కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అనుమానంతో విచారించగా సమర్ నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసుతో సమర్ చవాన్తో పాటు ఆభరణాల వ్యాపారి సంగ్రామ్ మోరేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read

Related posts