SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: వనస్థలిపురంలో హైకోర్టు సీనియర్ లాయర్‌ కిడ్నాప్‌.. రూ. కోటి డిమండ్‌! ఆ తర్వాత..



వనస్థలిపురంలో పట్టపగలు దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు అడ్వకేట్‌ను కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సరస్వతినగర్ SNR అపార్ట్మెంట్ నుంచి కారులో వచ్చిన దుండగులు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్న పాలడుగు నారాయణను కిడ్నాప్ చేశారు. అనంతరం కిడ్నాపర్లు నారాయణ భార్యకు ఫోన్ చేసి..


హైదరాబాద్, జూన్ 9: హైదరాబాద్‌ వనస్థలిపురంలో పట్టపగలు దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు అడ్వకేట్‌ను కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సరస్వతినగర్ SNR అపార్ట్మెంట్ నుంచి కారులో వచ్చిన దుండగులు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్న పాలడుగు నారాయణను కిడ్నాప్ చేశారు. అనంతరం కిడ్నాపర్లు నారాయణ భార్యకు ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో నారాయణ భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుబ్దులాపూర్ లోని ఓ భూవివాదం కిడ్నాప్ కు కారణంగా భావిస్తున్న పోలీసులు నగరమంతా జల్లెడ పట్టారు.


ఈ క్రమంలో వనస్థలిపురంలో అడ్వకేట్ కిడ్నాప్ కేస్‌ను గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలో మొత్తం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల విషయంలో తెలిసిన వ్యక్తులే కిడ్నాప్ చేశారని పోలీసులు భావిస్తున్నారు. తీసుకున్న డబ్బు ఇవ్వకోవడంతో హైకోర్ట్ అడ్వకేట్ పాలడుగు నారాయణను దుండగులు కిడ్నాప్ చేశారు.

అనంతరం కోటి రూపాయలు ఇవ్వాలని అడ్వకేట్ భార్యకు దుండగులు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. అడ్వకేట్ భార్య పోలీస్‌లను ఆశ్రయించడంతో ఫోన్ నంబర్ల, లొకేషన్ లు ఆధారంగా అడ్వకేట్‌ను సురక్షితంగా రక్షించ గలిగారు. డబ్బుల విషయంలోనే కిడ్నాప్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసిన వనస్థలిపురం పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Also read



Related posts

Share this