తీవ్రమైన కడుపునొప్పితో ఓ మహిళ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడున్న వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి.. స్కాన్ చేసి.. ఎక్స్‌రే తీయగా.. షాకింగ్ విషయం ఒకటి బయటకొచ్చింది. చివరికి బ్రతుకు జీవుడా.. అంటూ బ్రతికి బయటపడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
వివరాల్లోకెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం కోతులగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దారుణం జరిగింది. కుళ్లపాడు గ్రామానికి చెందిన షేక్ జాస్మిన్‌కి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లో దూది, చిన్న వైరు కడుపులో వదిలేశారు డాక్టర్లు. మే 27వ తేదీన కూనవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు బాధితురాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఇక ఆపరేషన్ అయినప్పటి నుంచి ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. దీంతో చేసేదేమిలేక భద్రాచలంలోని ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించింది బాధితురాలు. అక్కడ వైద్య సిబ్బంది స్కానింగ్ చేసి.. ఎక్స్‌రే తీయగా.. ఆమె కడుపులో దూది, వైరు ముక్క ఉన్నట్టు గుర్తించారు. హుటాహుటిన డాక్టర్లు ఆపరేషన్ చేసి.. వాటిని బయటకు తీయడంతో.. ప్రాణాపాయస్థితి నుంచి బయటపడింది బాధితురాలు. కాగా, తనకు ఇలా చేసిన కోతులగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సదరు బాధితురాలు.. న్యాయం కోసం ఆందోళనకు దిగింది
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!