గచ్చిబౌలిలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన సౌజన్య (27)కు పెద్దపల్లికి చెందిన బోగ కిరణ్‌తో 2024 మార్చి 22న పెళ్లి జరిగింది
గచ్చిబౌలిలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన సౌజన్య (27)కు పెద్దపల్లికి చెందిన బోగ కిరణ్‌తో 2024 మార్చి 22న పెళ్లి జరిగింది. కిరణ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. భార్యతో కలిసి టీఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే ఎప్పటిలాగే సోమవారం కిరణ్ డ్యూటీకి వెళ్లి సాయంత్రం వచ్చేసరికి తలుపులు మూసి ఉన్నాయి.
తలుపులు పగలగొట్టి చూడగా
దీంతో ఇరుగుపొరుగు సాయం తీసుకుని తలుపులు పగలగొట్టి చూడగా.. రూమ్ లో భార్య సౌజన్య ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భర్త కిరణ్‌తోపాటు అత్త మల్లీశ్వరి వేధింపులు తాళ లేకనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముందుగా సౌజన్య ఉద్యోగం చేయనవసరం లేదని పెళ్లి చేసుకున్నారని, పెళ్లి అయిన తర్వాత ఉద్యోగం చేయాల్సిందేనంటూ సౌజన్యను భర్త అనిల్ వేధించాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. మరోవైపు పెళ్లై రెండేళ్లు గడుస్తున్నా వీరికి పిల్లలు కలగలేదు. గర్భం దాల్చలేదని అత్త వేధింపులకు గురి చేసిందని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- దేవి నవరాత్రులు మొదలు దీపావళి వరకు- ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగలు, పుణ్య తిథులు ఇవే!
- నవరాత్రుల్లో అదృష్టం.. ఈ రాశి వారు కోరుకున్న కోరిక నెరవేరుతుంది
- Garuda Purana: అప్పు తీర్చకుండా మరణిస్తే ఏమవుతుంది? గరుడ పురాణం ఏం చెబుతోంది?
- Parivartan Yoga: పరివర్తన యోగం.. అదృష్టాలు పట్టబోయే రాశులివే..!
- మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను ఎందుకు పూజించాలి? గోత్రం తెలియకపోతే ఏం చేయాలి?





