మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాజేష్ తల్లి ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నిరు అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పరంగా రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని రాజేష్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. రాజేష్ మృతికి గల కారణాలు తెలియలేదు.
అమెరికాలో హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన రాజేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం 2015లో ఏరుకొండ రాజేష్ అమెరికా వెళ్లాడు. అతని మృతదేహం కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు చుస్తున్నారు. రాజేష్ తండ్రి 9 నెలల క్రితం మృతి చెందాడు. అయితే ప్రస్తుతం రాజేష్ మృతదేహం కోసం తల్లి కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టిస్తున్నాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఏరుకొండ రాజేష్ 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు యూఎస్ఏకు వెళ్ళాడు. 9సంవత్సరాలుగా అక్కడే ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
రాజేష్ మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు అక్కడి నుండి ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాజేష్ తల్లి ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నిరు అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పరంగా రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని రాజేష్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
Also read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





