వరంగల్‌లోని జిమ్‌లో కండలు పెంచుకునేందుకు స్టెరాయిడ్స్ అక్రమ విక్రయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ జిమ్ ట్రైనర్ను అరెస్ట్ చేసి, అతని వద్ద భారీ ఎత్తున స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో విదేశాల నుండి స్టెరాయిడ్స్ దిగుమతి చేసుకుని, యువతకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.
జిమ్‌లో చెమటోడ్చకుండా కండలు కావాలా..! ఆ స్టెరాయిడ్స్ వాడితే అతిసులువుగా కండలు పెంచేయచ్చు..! జిమ్ సెంటర్లే టెరాయిడ్స్ విక్రయాలకు కేరాఫ్ అడ్రస్.. జిమ్ ట్రైనర్లే స్టెరాయిడ్స్ వ్యాపారం నడుపుతున్నారు. వరంగల్ లో గతకొంత కాలంగా అడ్డు అదుపు లేకుండా జరుగుతున్న స్టెరాయిడ్స్ విక్రయాలు, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఓ జిమ్ ట్రైనర్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద భారీ ఎత్తున స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు.. వైజాగ్ నుండి వాటిని సరఫరా చేస్తున్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. కండలు పెంచాలనే మోజు అందరికీ ఉంటుంది. ఎవరైనా వ్యాయామం చేస్తే కండలు వస్తాయి.. కానీ చెమటోడ్చకుండా కండలు పెంచాలని కలలుగనే వారి కళలను నిజం చేయడం కోసం ఓ జిమ్ ట్రైనర్ అండ్ గ్యాంగ్ కండలు తెప్పిస్తామని కాసులు మోస్తున్నారు.
వరంగల్ లోని డాక్టర్స్ కాలనీకి చెందిన శ్రవణ్ అనేవ్యక్తి హనుమకొండలోని జీడీ జిమ్‌లో ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. కష్టపడకుండా కండలు పెంచడం ఎలాగో జిమ్‌కి వచ్చే యువతకు అలవాటు చేశాడు. తను కూడా స్టెరాయిడ్స్ వాడి కండలు పెంచానని చెప్పేవాడు. హనుమకొండ కు ప్రశాంత్ తో పాటు విశాఖపట్నంకు చెందిన మణికంఠ, ఆనంద్ అనే వ్యక్తుల ద్వారా ఆన్ లైన్ లో స్టెరాయిడ్స్ కొనుగోలు చేసేవారు. ఈ జిమ్‌కు వచ్చే యువతను స్టెరాయిడ్స్ కు బానిసలుగా మార్చి స్టెరాయిడ్ ఇంజక్షన్లు, ట్యాబ్లెట్స్ విక్రయిస్తూ వారి వద్ద వేలాది రూపాయలు గుంజేవారు. ఒక్కొక్కరి వద్ద 20వేల నుండి 30 వేల రూపాయల వరకు కాజేసీ స్టెరాయిడ్స్ అందించేవారు.
స్టెరాయిడ్స్ విక్రయాలు తిడుతున్న వ్యవహారం పోలీసుల దృష్టికి రావడంతో వరంగల్ లోని మట్టవాడ పోలీసులు శ్రవణ్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. వియత్నం, జర్మనీ, బల్గేరియా దేశాల నుండి వీటిని ఆన్ లైన్ లో దిగుమతి చేసుకుంటున్నట్లు పోలీసుల గుర్తించారు. మణికంఠ, ఆనంద్ ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి స్టెరాయిడ్స్ వినియోగించినా, విక్రయాలు జరిపివా వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. వీరి వద్ద భారీ ఎత్తున స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు, టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు.
Also read
- చోరీ చేసిన ఇంట్లోనే మకాం వేసిన దొంగోడు. మందు, విందులతో ఎంజాయ్..! మూడు రోజుల తరువాత..
- AP Crime: ఏపీలో సెల్ ఫోన్ గొడవ.. దారుణంగా హత్య చేసిన తాగుబోతు
- Somanath Temple: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. రూ.25లకే సోమనాథుడికి బిల్వ పత్రం సమర్పించి రుద్రాక్షను పొందవచ్చు.. ఎలాగంటే..
- Navagrahas: నవగ్రహ ప్రదక్షిణ చేశాక కాళ్లు కడుక్కోవాలా?.. ఈ పొరపాట్లు చేయకండి..
- Telangana: కొడుకు కాదు.. కాలయముడు.. కాసుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు!