తిరువన్నామలైలో దారుణం చోటుచేసుకుంది. ఏపీకి చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. గూడ్స్ వాహనం ఆపి తనిఖీల పేరుతో ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. స్థానికుల చొరవతో బాధితురాలు రక్షించబడింది. నిందితులైన కానిస్టేబుళ్లు సుందర్, సురేశ్ రాజ్ పరారీలో ఉన్నారు.
పోలీసులంటే ప్రజలను రక్షించేవారు. కానీ ఇక్కడ పోలీసులే రాక్షసులుగా మారారు. కామంతో కళ్లు ముసుకుపోయిన పోలీసులకు వాళ్లు యూనిఫామ్‌లో బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నామన్న విషయం కూడా మర్చిపోయి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరువన్నమలై (అరుణాచలం)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల యువతిపై పోలీసులపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంథాల్ బైపాస్ దగ్గర గత రాత్రి రౌండ్స్ సమయంలో టమాటాలు తీసుకెళ్తున్న గూడ్స్ వాహనాన్ని ఆపి తనిఖీ చేసినా ఇద్దరు కానిస్టేబుల్స్ అనుమానం ఉందని సదరు యువతిని ప్రశ్నించాలంటూ ఆమెను కిందకు దింపారు.
ఆ తర్వాత ఆమెను బలవంతంగా పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్ళి ఇద్దరు కానిస్టేబుళ్లు సుందర్, సురేశ్ రాజ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అటుగా వెళ్తున్న స్థానికులు ఆ యువతి కేకలు విని, ఆమెను ఆ కామాంధుల చెర నుంచి రక్షించి అంబులెన్స్‌లో తిరువన్నమలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ బాధిత యువతిని విచారించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రస్తుతం పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





