సమాజంలో రోజురోజుకీ హత్యాకాండలు పెరిగిపోతున్నాయి. మనిషిని మనిషి చంపుకోవటమే దారుణం.. అలాంటిది అయినవాళ్లు తమ ఆత్మీయులను, కుటుంబసభ్యులను దారుణంగా కడతేర్చుతున్నారు. మనిషి మృగంలా మారిపోయి ఇష్టారీతిన నేరాలకు పాల్పడుతున్నాడు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఓ దారుణ ఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. అత్యంత దారుణంగా ఓ వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి స్వయానా కట్టుకున్న భార్య, కన్న కొడుకే ఈ హత్య చేయడం గమనార్హం.
బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిరిధిలోని క్రిస్టల్ టౌన్లో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. వెటర్నరీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మసీఉద్దీన్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా రెండో భార్య షబానా, అతని కొడుకు సమీర్ హతమార్చారు. కాళ్లు, చేతులు కట్టేసి చాకుతో గొంతు కోసి ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా హతుడు మసీఉద్దీన్ అచేతన స్థితిలో పడి ఉన్నాడు. అయితే కుటుంబంలో కలహాలే హత్యకు దారి తీశాయనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Also read
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?
- పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్‌కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..






మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..