మైనర్ బాలికలను ప్రేమపేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. ఈ ఘటన ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి మరి. యాదగిరిగుట్టలో చోటు చేసుకుంది. దీనిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లోని తార్నాకలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలను యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు ముగ్గురు యువకులు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలకు మాయమాటలు చెప్పి.. సదరు యువకులు బడి ఎగ్గొట్టేలా చేశారు. ఆ యువకుల మాటలు నమ్మిన బాలికలు స్కూల్‌లో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. శనివారం యాదగిరిగుట్టకు దైవ దర్శనానికి తీసుకెళ్లి.. అక్కడ ముగ్గురు బాలికలపై ఆ యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు.
అనంతరం బాలికలను హైదరాబాద్‌లో వదిలిపెట్టి పరారయ్యారు. సాయంత్రం తార్నాకకు తిరిగొచ్చాక జరిగిన సంఘటనపై తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు బాలికలు. బాలికల పేరెంట్స్ ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు అల్వాల్ పోలీసులు. వారిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికలను మోసం చేసిన యువకులలో GHMC కాంట్రాక్ట్ ఉద్యోగి మధు, షాపింగ్ మాల్‌లో పనిచేసే వంశీ, పెట్రోల్ బంకులో పనిచేసే నీరజ్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. కాగా, ఈ ముగ్గురు నిందితులతో పాటు.. లాడ్జి ఓనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Also read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





