ఈ మధ్య కొంతమంది మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తూ అభం,శుభం తెలియని చిన్నారుల జీవితాలను ఆదిలోనే చిదిమేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజగా సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఏడో తరగతి బాలికపై పక్కింట్లో ఉండే యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కొమురవెల్లి మండలం గురువన్నపేటలో చోటు చేసుకుంది.
గురవున్నపేట గ్రామానికి చెందిన ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై శుక్రవారం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అత్యాచారం చేశాడు. కాగా శనివారం బాలికకు కడుపునొప్పి రావడంతో పాటు బ్లీడింగ్ కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలికపై అత్యాచారం జరిగిందని తెలియడంతో కుటుంబ సభ్యులు బాలికను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులు ఆ యువకుని ఇంటికి వెళ్లి గొడవ చేయగా..యువకునితో పాటు అతని కుటుంబ సభ్యులు ఊరి నుండి పరారైయ్యారు.
దీనితో ఆగ్రహించిన బాలిక కుంటుంబ సభ్యులు యువకుని ఇంటి పై దాడి చేసి, ఇంటి పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మెయిన్ డోర్‌కి అగ్గి అంటుకుంది. అక్కడే ఉన్న కారు, జేసిబీలపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని అందర్నీ చెదరగొట్టి గోడవను కంట్రోల్ చేశారు. కాగా ఇప్పటికే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరణ చేయలేదు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి వారిని వదిలిపెట్టవద్దని కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యలు డిమాండ్ చేస్తున్నారు.
also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





