Vijayawada: విజయవాడ నగరం ఒక్కసారిగా ఉగ్ర భయంతో వణికిపోయింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే వించిపేట ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) అధికారులు నిర్వహించిన మెరుపు దాడులు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. ఈ నేపత్యంలో విజయవాడ ఉగ్ర లింకుల కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. 2025 జూన్‌లో ముగ్గురిని గుజరాత్ ATS అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి పోలీసులకు అనుమానం రాకుండా.. జాగ్రత్తపడింది 12 మంది సభ్యుల గ్యాంగ్. అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో.. సంస్థను ఏర్పాటు చేశారు సొహైల్ బేగ్, షరీఫ్, డానిష్. ఇన్‌స్టా గ్రూప్‌లో 12 మంది ఉన్నట్టు గుర్తించారు.
వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్నాటక, బిహార్.. మహారాష్ట్ర,ఢిల్లీలో కార్యకలాపాలకు ఈ గ్యాంగ్ సిద్ధమైనట్లు గుర్తించారు. బిహార్ వాసి దిల్కాష్ సహా మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా రెండు గ్రూప్‌లు నడుస్తున్నట్లు గుర్తించారు. IQIS, ISIS పేర్లతో గ్రూప్‌లు పెట్టారు నిందితులు. తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు విజయవాడకు చెందిన వారు, ఒకరు హైదరాబాద్‌కు చెందిన వారిని అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఐజీ త్రిపాఠి ప్రకటించారు.
ముగ్గురు నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించడం, యువతను ఆకర్షించడమే వీరి అజెండాగా పోలీసులు తేల్చారు. రెండు గ్రూపుల్లో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారి సమాచారం సేకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ఏటీఎస్‌కు సమాచారం అందించి వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందాలు సిద్ధమయ్యాయి.
Also read
- బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు
- Andhra Pradesh: పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు..
- ‘బైక్ కావాలి’ అంటూ భార్యను వేధించిన ఇంజినీర్ భర్త!
- లైంగిక వేధింపుల అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం.. Viral video
- మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?






నాకు, జగన్‌కు మధ్య విభేదాలు సృష్టించారు… మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు