ఎలాగైనా ఈజీగా డబ్బులు సంపాదించాలని వారిద్దరూ ఒక్కటి అయ్యారు. సహజీవనం చేస్తూ కలిసిమెలిసి దొంగతనాలు చేస్తూ చివరికి పోలీసులకు దొరికి కటకటాల్లోకి వెళ్లారు. ఆన్లైన్ గేమ్‌లకు బానిలుగా మారి, ఆర్థిక సమస్యలు, అప్పుల భారం భరించలేక చోరీల బాట పట్టిన ఒక జంటకు మెదక్ పోలీసులు చెక్ పెట్టారు. ఇద్దరి అరెస్ట్ చేసి జైల్లో వేశారు.
ప్రస్తుత జనరేషన్‌లో కొందరు యువకులు తన తెలిపితేటలతో అద్భుతాలు సృష్టిస్తుంటే మరికొందరు మాత్రం ఆన్‌గేమ్స్, బెట్టింగ్ యాప్స్ బారీన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అప్పుచేసి ఆన్‌గేమ్స్‌లో పెట్టుబడులు పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలానే ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైన ఓ జంట వాటిని తీర్చేందుకు దొంగతనాలు చేయడం మొదటు పెట్టింది. చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలైంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరికి బండ శివారులో ఈనెల 7వ తేదీన ఒక వృద్ధ మహిళను సహాయం పేరిట ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లి ఆమె నుంచి బంగారు నగలు చోరీ చేసిన కేసులో ఈ జంటను అరెస్ట్ చేశారు మెదక్ జిల్లా పోలీసులు.
వివరాళ్లోకి వెళితే.. గజ్వేల్ బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధ మహిళను చూసిన ఆ జంట పల్సర్ బైక్‌పై ఆమె దక్కరకు వచ్చారు. ఆమెను ఎక్కడికి వెళ్లాలని అడిని అక్కడ దించుతామని నమ్మించి బైక్‌పై ఎక్కించుకొని తీసుకువెళ్లారు. బైక్‌పై వెళ్తుండగా ఆ మహిళకు మత్తు మందు ఇచ్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగలు చోరీ చేసి ఆమెను రోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన ఆ వృద్ధ మహిళ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు పరిగణనలోకి తీసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. నిందితులు వెల్దుర్తి మండలం కొప్పులపల్లి గ్రామనికి చెందిన బదనాపురం పెంటయ్య, తూప్రాన్ మండలం వట్టూరు గ్రామానికి చెందిన వరలక్ష్మిగా గుర్తించారు. పెంటయ్య ట్రాక్టర్ డ్రైవర్ గా విధులు నిర్వహించేవారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆన్లైన్ గేమ్ కి అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. ఇక అప్పులు తీర్చేందుకు ఏ మార్గం లేక చోరీ బాటా ఎంచుకున్నాడు. ఇక వరలక్ష్మి విషయానికి వస్తే ఈమెకు భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది
Also read
- Crime News: ప్రియుడితో కలిసి భర్తను చంపించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
- నేటి జాతకములు..16 జూలై, 2025
- Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..
- Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
- చిన్నతనంలోనే ఇంత పంతం ఎందుకు.. విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి..