అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని హత్య, మైనర్ బాలికపై అత్యాచారం సంఘటనలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. నిర్లక్ష్యంపై సీఐని సస్పెండ్ చేశారు. 13 మందిని అరెస్ట్ చేశారు. ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. వైసీపీ నాయకుల నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అత్యాచార ఘటనలపై అనంతపురంలో వైసీపీ నేతల నిరసనలకు దిగారు. అయితే వారిని పోలీసుల అడ్డగించడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలపై ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సైతం అనంతపురంలో పర్యటించారు.
అనంతపురం శివారు కూడేరులో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసు.. రామగిరిలో మైనర్ బాలికపై రెండు సంవత్సరాల పాటు 14 మంది అత్యాచారం కేసు.. రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో నిర్లక్ష్యం వ్యవహరించిన అనంతపురం సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మైనర్ బాలిక కేసులో 13 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన ఈ రెండు సంఘటనలను ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించింది. స్వయంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ అనంతపురంలో పర్యటించి.. అత్యాచారానికి గురైన మైనర్ బాలికను పరామర్శించారు.
అదేవిధంగా హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని తన్మయి తల్లదండ్రులను కూడా పరామర్శించారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ అనంతపురంలో పర్యటిస్తుండగానే.. వైసీపీ నాయకులు చలో పేరూరుకు పిలుపునిచ్చారు. మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్.. మాజీ మంత్రి మేరుగ నాగర్జున.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు ప్రకాష్ రెడ్డి. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై కూర్చుని మాజీ మంత్రి ఉషశ్రీ నిరసన తెలిపారు
Also read
- Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..
- Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
- చిన్నతనంలోనే ఇంత పంతం ఎందుకు.. విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి..
- Andhra News: తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారంటూ ఫేక్ వీడియోతో ప్రచారం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్!
- వీళ్లకు ఏమయ్యింది.. ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఆ తర్వాత ట్విస్ట్ ఇదే..