సాధారణంగా బయట ఏదైనా నేరానికి పాల్పడితే జైలుకు పంపుతూ ఉంటారు. అయితే జైలులోనే బరితెగించారు కొంతమంది నిందితులు. హైదరాబాద్ శివారు చర్లపల్లి జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. నేరం చేసి జైలులో ఉన్న నిందితులు ఏకంగా సిబ్బందిపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జైలు అధికారులు విచారణ జరుపుతున్నారు. చర్లపల్లి సూపరిండెంట్ తెలిపిన వివరాల ప్రకారం పలు జైలులో ఉన్న మత్తు పదార్థాల వాడకంతో పట్టుబడ్డ నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. పలుమార్లు కోర్టుకు తరలించే క్రమంలో ఈ నిందితులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుండడంతో వీరందరినీ చర్లపల్లి జైలుకు తీసుకొచ్చారు.
అయితే చర్లపల్లి జైలులో సాధారణ ఖైదీలతో పాటే వీరిని సైతం పోలీసులు ఉంచారు. నిరంతరం గంజాయికి అలవాటు పడిన బ్యాచ్ కావడంతో పదేపదే గంజాయి కావాలని పోలీసులను వేధిస్తున్నారు. వీరిని మిగతా ఖైదీలతో పాటే బరాక్ లో పెట్టడంతో మిగతా ఖైదీలతో వీరు వాగ్వాదానికి దిగుతున్నారు. మోతాదుకు మించిన గంజాయి సేవించడంతో వీరిని పలు కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. పదేపదే గంజాయి సేవిస్తూ తమ మానసికస్థితిని సైతం కోల్పోయి వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. అయితే చర్లపల్లి జైలు లాంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా మత్తుపదార్థాలకు ఆస్కారం ఉండదు. ఈ విషయాన్ని గంజాయి బ్యాచ్ కు చెప్పటంతో పోలీసులపైనే రివర్స్‌లో దాడి చేస్తున్నారు నిందితులు.
అక్కడ ఉన్న తోటి నిందితులపైన ఈ బ్యాచ్ దురుసుగా ప్రవర్తిస్తుండటంతో జైలు స్టాఫ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో గంజాయి నిందితులపై కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. సాధారణ నిందితుల నుండి గంజాయి నిందితులను వేరు చేస్తూ వీరిని ప్రత్యేక బరాక్ లో ఉంచారుజైలు అధికారులు. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితులు జైలు సిబ్బంది పైనా దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై చర్లపల్లి జైలు అధికారులు స్థానిక కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Also read
- Telangana: అయ్యో దేవుడా.. పెళ్లైనా 6 నెలలకే ఇంత దారుణమా.. శాడిస్ట్ భర్త వేధింపులతో..
- Delhi Blast: కారు ఓనర్ పుల్వామా నివాసి.. ఢిల్లీ పేలుడు కేసులో సంచలన విషయాలు..
- Delhi Blast: అల్ ఫలా యూనివర్సిటీ నీడలో టెర్రరిస్టులు.. మొత్తం ఆరుగురు డాక్టర్లు అరెస్ట్!
- ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పురోగతి.. డాక్టర్లుగా పని చేస్తూ.Delhi blast Latest updates
- Delhi Blast: ఎర్రకోట దగ్గర పార్కింగ్‌లో 3 గంటలు వెయిటింగ్.. ఆ సూసైడ్ బాంబర్ ఇతనే..





