హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఎలక్ట్రిక్ బస్ ఓ యువతిని ఢీకొట్టింది.. దీంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. కలువ మాధవి (25) అనే యువతి శుక్రవారం రాత్రి..
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగింది.. వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యం.. భద్రతా ప్రమాణలను పాటించకపోవడం.. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం.. ఇలా అనేక కారణాల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా.. హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి టీజీఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ ఓ యువతిని ఢీకొట్టింది.. దీంతో యువతి ప్రాణాలు కోల్పోయింది.
కలువ మాధవి (25) అనే యువతి శుక్రవారం (సెప్టెంబర్ 13) రాత్రి కొత్తగుడా చౌరస్తా నుంచి మాదాపూర్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది.. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తోంది.. అయితే.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు.. నేరుగా ఆమెను ఢీ కొట్టింది. దీంతో మాధవికి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే గమనించిన స్థానికులు దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించి మాధవి మరణించింది.. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది..
వీడియో చూడండి..
అనంతరం పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025