ఓ యువతి.. ఇద్దరు యువకులు.. ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు. వారి దగ్గర ఏవో బ్యాగులున్నాయి.. రాగానే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ) లోని ఓ హోటల్ లో దిగారు.. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. వారున్న గదిలో తనిఖీలు చేయగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.. వారు కాకినాడ నుంచి గంజాయి తీసుకొచ్చి.. హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు తేలింది.. ఈ ఘటన కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. గంజాయి విక్రయిస్తున్న యువతిని.. ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాకినాడ నుండి డ్రై గంజాయి తీసుకొచ్చిన ముగ్గురు.. కూకట్ పల్లి ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాకినాడ నుండి గంజాయ్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయించేందుకు జ్యోతి, అజయ్, రమేష్ యత్నించారన్నారు.
కె.పి.హెచ్.బి లోని ఓ హోటల్ గదిలో ముగ్గురు ఉండగా దాడి చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 6 కేజీల ఎండు గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
గంజాయ్ ఎవరికి విక్రయిస్తున్నారు.. వారి నెట్ వర్క్ ఎక్కడుంది..? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు
Also Read
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*
- చేతిలో కాస్ట్లీ ఫోన్.. మెడలో టీటీడీ ఐడీ కార్డ్.. అనుమానం వచ్చి ఆరా తీస్తే గుట్టురట్టు..!
- ట్రైన్ ఇంజన్లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్..





