చేసేది తాపీ పని.. హైదరాబాద్ వచ్చి సెటిలయ్యాడు.. ఈ క్రమంలో మరో దందా మొదలుపెట్టాడు.. అదేంటంటే.. అధిక వడ్డీ.. చిట్టీలు.. ఇక యవ్వారం మామూలుగా లేదు.. డబ్బులే డబ్బులు.. వేలు.. లక్షలు పోయ్యాయి.. ఇక కోట్లే కోట్లు.. డబ్బే డబ్బు అంటూ అతని తీరు సాగింది.. అయితే.. ఈ క్రమంలోనే మొత్తం పోగేసుకోవాలన్న ఆశ పుట్టింది.. ఇంకేముంది.. కట్ చేస్తే.. రూ.70 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు.. ఆ తాపీ మేస్త్రీ .. దీంతో బాధితులు లబోదిబోమంటూ తలపట్టుకుంటున్నారు.. తాపీ పని చేస్తూ హైదరాబాద్ లో స్థిరపడిన ఓ వ్యక్తి అధిక వడ్డీ, చిట్టీల పేరుతో డబ్బులు వసూలుచేసి.. రూ.70 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు.. ఈ ఘటన ఎస్‌ఆర్ నగర్‌లో చోటుచేసుకుంది..
వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన పుల్లయ్య తాపీ పని చేస్తూ హైదరాబాద్ లో స్థిరపడ్డాడు.. రెండు దశాబ్దాలుగా ఎస్‌ఆర్ నగర్‌లో నివాసం ఉంటూ.. భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేస్తున్నాడు.. స్థానికులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో చిట్టీ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.. ఈ క్రమంలో అధిక వడ్డీ పేరుతో దాదాపు 300కుపైగా ఖాతాదారులను జమచేశాడు.. వారి నుంచి దాదాపు రూ.70 కోట్లను వసూలు చేశాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు..
కాగా.. పుల్లయ్య బాధితులు అమీర్ పేట్, ఎస్ ఆర్ నగర్, బల్కంపేట ప్రాంతాలకే పరిమితం కాలేదని.. అతని స్వస్థలమైన అనంతపురం జిల్లాలోని గుత్తి, కర్నూల్ జిల్లాలో కూడా ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే.. అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో తాము దాచుకున్న నగదుతోపాటు తమకు తెలిసిన వారి నగదును కూడా పుల్లయ్య దగ్గర డిపాజిట్లు చేయించామని.. బాధితులు లబోదిబోమంటున్నారు..
అయితే.. డబ్బు కోసం ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో పుల్లయ్య ఈనెల 24, 25, 26వ తేదీల్లో డబ్బులు చెల్లిస్తున్నానంటూ అందరినీ నమ్మించాడు.. అయితే 23వ తేదీ సాయంత్రం తన ఫార్చునర్ వాహనాన్ని ఇంట్లోనే వదిలి ఓ క్యాబ్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి పారిపోయినట్లు పేర్కొంటున్నారు. అయితే.. నగదు కోసం పుల్లయ్య ఇంటికి వచ్చిన వారు.. ఇక్కడ పరిస్థితిని చూసి మిగతావారికి సమచారం ఇచ్చారు.. దీంతో వారంతా కలిసి ఎస్‌ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.. కాగా.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది
Also read
- శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
- Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
- నేటి జాతకములు…14 మార్చి, 2025
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి