ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసి చెత్త డబ్బాలో కుక్కి అటవీ ప్రాంతంలో పడేశాడు భర్త. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయితే హత్యకు గురైన వివాహిత హైదరాబాద్‌కు చెందిన మహిళగా గుర్తించారు అక్కడి పోలీసులు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు విక్టోరియా పోలీసులు. హైదరాబాద్‌కు చెందిన వివాహిత ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైంది ప్రేమించి పెళ్లాడిన భర్త ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెత్త డబ్బాలో కుక్కి అటవీ ప్రాంతంలో పడేశాడు. తన ఇద్దరి కుమారులను తీసుకొని తిరిగి హైదరాబాదుకు వచ్చాడు. కాప్రా బృందావన్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి బాలిశెట్టి గౌడ్ పెద్ద కుమార్తె శ్వేత ఎం ఫార్మసీ కోసం 2009లో ఆస్ట్రేలియాకు వెళ్ళింది. శ్వేతకు అప్పటికే అశోక్ నగర్‌కు చెందిన అశోక్ రాజుతో పరిచయం అయింది. అశోక రాజు ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ గా పని చేస్తున్నాడు. 2012లో హైదరాబాదులో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో పాయింట్ కుక్‌లో స్థిరపడ్డారు. అయితే ఇద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. ఈనెల 5న చివరిగా తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడిన శ్వేత తరచూ గొడవలు జరుగుతున్నాయని భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఈనెల 5న గొడవ జరగ్గా అశోక్ రాజు, శ్వేత గొంతు నిలిమి హత్య చేశాడు. అనంతరం చెత్త డబ్బాలో కుక్కి కారులో 82 కిలోమీటర్ల దూరంలో బక్రీద్ ప్రాంతంలో పడవేశాడు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన భర్త కుమారుడ్ని భార్య తల్లిదండ్రులకు అప్పగించి విషయాన్ని తెలియజేశాడు. విషయం తెలుసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి.. బాలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రికి కిషన్ రెడ్డి లేఖ రాసినట్లు తెలిపారు. అశోక రాజును అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న విక్టోరియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





