వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు.
TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కోడలితో అసభ్య ప్రవర్తన..
ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు.
ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్, ఎస్సై సందీప్‌కుమార్ తెలిపారు.
Also read
- Somanath Temple: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. రూ.25లకే సోమనాథుడికి బిల్వ పత్రం సమర్పించి రుద్రాక్షను పొందవచ్చు.. ఎలాగంటే..
- Navagrahas: నవగ్రహ ప్రదక్షిణ చేశాక కాళ్లు కడుక్కోవాలా?.. ఈ పొరపాట్లు చేయకండి..
- Telangana: కొడుకు కాదు.. కాలయముడు.. కాసుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు!
- నేటి జాతకములు..2 జూలై, 2025
- చెత్త లారీలో మృతదేహం.. వీడిన మిస్టరీ! షంషుద్దీన్‌తో ఏడాదిన్నరగా వివాహేతర బంధం.. ఆ తర్వాత