కొద్ది గంటల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. కుటుంబ సభ్యులందరూ ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. అటు బంధుమిత్రులు కూడా ఇంటికి చేరుకుంటున్నారు. ఇంట్లో ఏర్పాట్లు కూడా చకచకగా జరుగుతున్నాయి. కానీ ఇంతలోనే పెను విషాదం ఆ ఫ్యామిలీని వెంటాడింది. తెల్లారితే నిశ్చితార్థం చేసుకోవాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో ముగినిపోయింది.
ఇక తెల్లారితో తనకు కాబోయే కళల రాణితో నిశ్చితార్థం జరగాల్సిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. పెళ్లి వాతవరణంతో సందడిగా మారాల్సిన ఆ ఇళ్లు యువకుడి చావుతో బోసిపోయింది. ఈ ఘటన స్థానికంగా అందరినీ తీవ్రంగా కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ లోని మద్దులపల్లికి చెందిన ప్రసాద్‌కు ఇటీవలే పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఈ నెల 02న అనగా గురువారం అతనికి నిశ్చితార్థం కూడా జరగనుంది.
ఇందుకోసం ఇంట్లో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రసాద్ కిరాణా సమాన్ కోసమని షాప్‌కు వెళ్లాడు. సమాన్లు తీసుకొని తిరిగి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ప్రసాద్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రసాద్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కే మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ప్రసాద్‌ను హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని కారుతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్ మరణం విషయం విన్న కుటుంంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తెల్లారిలో నిశ్చితార్థం చేసుకోవాల్సి యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also read
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్‌పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్‌చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..





