గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముకను ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రి వైద్యులు 66 ఏళ్ల వృద్దుడి గుండె దగ్గర అన్నవాహికలో ఉన్న మటన్ ఎముకను విజయవంతంగా తొలగించారు. ఈ ఎముక గత నెలరోజులుగా శ్రీరాములు అనే రోగి గొంతులోనే ఇరుక్కుని ఉంది. దీంతో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. కక్కిరెన్ గ్రామానికి చెందిన శ్రీరాములు ఆహారాన్ని సరిగ్గా నమలలేకపోవడం వల్ల ఈ సమస్యను కొనితెచ్చుకున్నట్లు చెబుతున్నారు వైద్యులు. మటన్ తింటూ పొరపాటున 3.5 సెంటీమీటర్ల ఎముకను మింగేశాడు శ్రీరాములు. మొదట్లో అన్నం సరిగ్గా తినలేక పోవడానికి కారణం గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని తప్పుగా నిర్ధారించారు కొందరు వైద్యులు. అయితే శ్రీరాములు సమస్య రోజు రోజుకు తీవ్రతరం కావడంతో కామినేని ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేందుకు వచ్చాడు.
అతని పరిస్థితిని గమనించిన వైద్యులు ఎండోస్కోపీ చేయాలని చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది చెప్పిన పరీక్షలు చేయించుకునేందుకు సిద్దమయ్యాడు శ్రీరాములు. వైద్య పరీక్షల్లో ఎముక అడ్డంగా ఉందని గుర్తించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి దానిని బయటకు తీయాలని చెప్పారు డాక్టర్ నిట్టాలా. ఆపరేషన్‌కు అంగీకరించిన బాధితుడు శ్రీరాములుకు ప్రత్యేక వైద్య బృందం ప్రత్యేక శ్రద్ద తీసుకుని జాగ్రత్తగా సర్జరీ చేశారు. ఆహార వాహికలో అడ్డుగా ఉన్న మటన్ ఎముకను విజయవంతంగా తొలగించారు. శ్రీరాములు రికవరీకి అవడం కోసం కొన్ని రోజులు ద్రవ పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. తనకు ఉన్న సమస్యను తొలగించిన డాక్టర్లకు ప్రత్యేక కృతజ్ఙతలు తెలుపుకున్నాడు శ్రీరాములు.
Also read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




