భర్త మోసం చేశాడు.. హింసిస్తున్నాడు.. అంటూ మహిళలు భర్తల ఇళ్ల ముందు ఆందోళనకు దిగిన ఘటనలు గతంలో చూశాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్. భర్తే భార్య ఇంటి ముందుకు ఆందోళనకు దిగాడు. భార్య ఎంత రిక్వెస్ట్ చేసినా కాపురానికి రావడం లేదని అతను ఈ పనికి పూనుకున్నాడు.
సహజంగా.. భర్త వేధింపులు భరించలేక..భార్యలు ఆందోళన చేస్తారు.. ఇలాంటి సంఘటనలు తరుచు జరుగుతుంటాయి.. కానీ.. భర్తే ఆందోళన చేశాడు. భార్య కాపురానికి రావడం లేదని మహిళా సంఘాలతో కలిసి భార్య ఇంటి ఎదుట బైటయించాడు.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ప్రకాశం రోడ్‌లో నివసిస్తున్న గాజుల అజయ్ అనే వ్యక్తి భార్య శివాని ఇంటి ఎదుట మహిళ సంఘాలతో బైఠాయించాడు. భార్యతో రెండేళ్ల బాబుతో కలిసి తల్లిగారి ఇంటివద్దే ఉంటుంది. భార్య గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తీసుకురావడానికి పలుమార్లు ప్రయత్నించాడు. పెద్ద మనుషులతో కూడా చెప్పించాడు. అయినప్పటికీ.. ఆమె భర్త వద్దకు వచ్చేందుకు ముందుకు లేదు. ఇక నుంచి ఏమీ అనను..మంచిగా చూసుకుంటానని భరోసా ఇచ్చినప్పటికీ ఆమె మనసు మారలేదు. ఈ క్రమంలో భర్తకు ఓపిక నశించి.. అత్తగారి ఇంటి ఎదుట బైటయించాడు. మహిళా సంఘాలు కుడా అతనికి మద్దతు ఇచ్చాయి.
అయితే అత్తవారింటికి వెళ్తే తనకు రక్షణ లేదని భార్య శివాని ఆరోపిస్తోంది. నిత్యం వేధింపులకు గురి చేస్తూ.. ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తోంది. భార్య ఎంతకూ బెట్టు వీడకపోవడంతో.. చాలాసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు భర్త. అయితే భర్త ఈ ఆందోళనను చూసి.. స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భర్తలు.. ఆందోళన చేసిన సంఘటన చూడటం ఇదే తొలిసారి అంటున్నారు. ఇప్పటికైనా భార్య మనస్సు కరుగుతుందో లేదో వేచి చూడాలి.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025