తడగొండకు చెందిన హరీశ్ (36) అనే వ్యక్తికి, 2014లో కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఇద్దరికీ ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ అవసరాల కోసం హరీశ్ దుబాయికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో అతని భార్య.. ఇదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో సంబంధం పెట్టుకున్నట్టు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం తడగొండ గ్రామంలో ఓ కుటుంబం చీకటిలో మునిగిపోయింది. నైతిక సంబంధాలు పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుతున్నాయి. చక్కటి జీవితాలను చిద్రం చేస్తున్నాయి. భార్య మాటలతో మనస్తాపానికి గురైన ఓ భర్త వ్యవసాయ బావిలో దూకి తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఈ విషాద ఘటన తడగొండలో చోటు చేసుకుంది.
తడగొండకు చెందిన హరీశ్ (36) అనే వ్యక్తికి, 2014లో కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఇద్దరికీ ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ అవసరాల కోసం హరీశ్ దుబాయికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో అతని భార్య.. ఇదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో సంబంధం పెట్టుకున్నట్టు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయం తెలిసిన హరీశ్, భార్యతో ఫోన్‌లో వాగ్వాదానికి దిగాడు. నిజాలను తెలుసుకుని జూన్ 8వ తేదీన స్వదేశానికి తిరిగొచ్చిన హరీశ్, భార్యను మందలించాడు. అయితే ఆమె అతనితో వాగ్వివాదానికి దిగింది. “నువ్వు నాకు వద్దు.. చచ్చిపో..! నేను అతనితోనే ఉంటా..” అని తేల్చి చెప్పింది. ఈ మాటలు హరీశ్ మనసును బాధించాయి. అవమానంగా భావించి, జీవితంపై నమ్మకం కోల్పోయి, బయటికి వెళ్లి వస్తానని చెప్పి, ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషాద ఘటన విన్న తర్వాత తల్లిదండ్రుల గుండె బరువైపోయింది. తన కుమారుడి మృతిపై హరీశ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్య, ఆమె ప్రియుడిపై కేసు నమోదైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భార్య అన్న మాటతో కుమిలిపోయి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఈ ఆత్మహత్య చర్చకు దారి తీసింది. ఇలాంటి వ్యక్తి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల ఇలాంటి సంబంధాలు పెరిగి, ఎన్నో కుటుంబాలు అంధకారంలోకొట్టుమిట్టడుతున్నాయంటున్నారు
Also read
- Tadipatri: వేట కొడవలితో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
- Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. కుమారుడిని చంపి కాలువలో పూడ్చేసిన తండ్రి
- Crime News: ప్రియుడితో కలిసి భర్తను చంపించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
- నేటి జాతకములు..16 జూలై, 2025
- Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..