జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి మండలం రామచంద్రంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి ఒకరోజు ముందు వరుడు కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి సందడి మధ్య ఈ ఘటన కుటుంబ సభ్యులను, బంధువులను కన్నీళ్లలో ముంచెత్తింది. కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
అనాలోచితంగానో లేక క్షణికావేశంలోనూ కొంతమంది చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారి తీసుకునే ఆ నిర్ణయాల వల్ల కొన్ని కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతాయి. తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా ఎలాంటి టైమ్‌లో తెలిస్తే అయ్యో పాపం అంటారు. ఆ ఇళ్లంతా ఎంతో సందడిగా ఉంది, ఎందుకంటే.. తెల్లారితే ఆ ఇంట్లో పెళ్లి. తమ కుమారుడికి పెళ్లి అవుతుందనే సంతోషంలో ఆ తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. చుట్టాలంతా రావడంతో ఇళ్లంతా ఎంతో సందడిగా ఉంది. అప్పటికే పెళ్లి పనులన్నీ జరిగిపోయాయి. ఈ రాత్రి గడిస్తే రేపు మంగళవాయిద్యాల మధ్య నూతన జంట ఒక్కటి కానుంది. కానీ, అంతలోనే ఆ పెళ్లి కొడుకు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.
పెళ్లికి ఒక్క రోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామచంద్రంపేటలో చోటు చేసుకుంది. మృతుడి పేరు కిరణ్. తెల్లారితే పెళ్లి పెట్టుకొని ఇంత కఠిన నిర్ణయం తీసుకొని, తనవు చాలించాడు. పెళ్లి కొడుకుగా మారి పెళ్లి పీటలు ఎక్కుతాడనుకున్న కుమారుడు, శవమై పాడెక్కుతుంటే ఆ కన్నవాళ్లు గుండెలు పగిలేలా విలపించారు. పెళ్లి చూద్దామని వచ్చిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కిరణ్ ఆత్మహత్యతో మరోవైపు వధువు ఇంట్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది.
Also read
- వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి





