చూడడానికి ఉన్నత కుటుంబాలకు చెందిన వారుగా కనిపించే ఆ దంపతుల దందా తెలిస్తే అబ్బో అనిపిస్తుంది.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఆ కిలాడి దంపతులు గుట్టు చప్పుడు కాకుండా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ వరంగల్ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు..ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ దంపతులు దురాశతో ప్రేమికుల రోజునే కటకటాల పాలయ్యారు.. వారి నుంచి సుమారు 6 లక్షల రూపాయల విలువ గల 20 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు…
ఒడిస్సా రాష్ట్రానికి చెందిన శంకర్ దాస్ – పూర్ణిమ భోగి దాస్ భార్యాభర్తలు… ఆరేళ్ల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నారు.. ప్రస్తుతం ఈ దంపతులు సూరత్‌లో నివాసం ఉంటున్నారు.. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో గంజాయి స్మగ్లింగ్ చేసి.. విక్రయాలకు శ్రీకారం చుట్టారు.. ఒడిస్సా నుంచి మూడో కంటికి తెలియకుండా గంజాయి తీసుకొచ్చి గుజరాత్‌లో విక్రయాలు జరపడం వీళ్ల దందా…
ఇలా గంజాయి సరఫరా చేసి దర్జాగా జీవితాన్ని గడుపుతున్న ఈ దంపతులు.. తాజాగా అదే పని మీద ఒడిషా వచ్చారు. ప్రదీప్ అనే స్మగ్లర్ వద్ద గంజాయి కొనుగోలు చేసి రహసంగా బ్యాగులో భద్రపరిచారు.. చూడడానికి క్లాస్‌గా తయారై ఖరీదైన దుస్తులు ధరించి రైలు మార్గంలో బ్యాగులో గంజాయి భద్రపరిచి వరంగల్ మీదుగా సూరత్‌కు వెళ్తున్నారు.. కాని డ్యామిట్ కథ అడ్డం తిరిగి ఖాకీలకు చిక్కారు
వీరిని వరంగల్ రైల్వే స్టేషన్ పోలీసులు పట్టుకున్నారు.. వరంగల్ రైల్వే స్టేషన్ లో రైలు దిగి మరో మార్గం ద్వారా ముంబై వెళ్లేందుకు మూడో ప్లాట్ ఫామ్ నుంచి బయటకు వెళుతున్నారు.. అదే సమయంలో డ్రగ్స్ కంట్రోల్ టీంతో కలిసి మిల్స్ కాలనీ పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నారు.. అనుమానంతో వీరి బ్యాగులు తనిఖీ చేయగా అందులో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది..
చూడడానికి ఖరీదైన దుస్తులు ధరించి క్లాస్‌గా తయారైన ఈ దంపతులు బ్యాగులో గంజాయి ప్యాక్ చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రాలు దాటించడం చూసి పోలీసులే అవాక్కయ్యారు.. వారి వద్ద 20 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులిద్దర్నీ అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు
Also read
- Hyderabad: వేకువజామున నీళ్లు కావాలని ఇంట్లోకి దూరాడు.. ఆమె లోపలికి వెళ్లగానే..
- ఆడ వేషంలో పెళ్లైన ప్రియురాలి ఇంటికి బాయ్‌ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- Telangana: మటన్ కర్రీ వండలేదన్న పాపానికి.. భర్త ఏం చేశాడో చూస్తే దిమ్మతిరుగుద్ది.!
- Andhra News: పాపం పెద్దావిడ తిరుపతి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.. లీలగా మాయ చేసి..
- Telangana: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థిని.. ఒక్కసారిగా శబ్దం.. ఏమైందంటే..?