శ్రీ సత్య సాయి – శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కుటాలపల్లి గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి (40) ని సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అమర్నాథ్ రెడ్డి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి వెళ్లారు. కాగా, హోలీ పండుగ సందర్భంగా గ్రామంలో ప్రజలు సంతోషాలతో కలుపుతుండగా విషయం తెలియడంతో ఒకసారిగా గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
విషయం తెలిసిన వెంటనే నల్లమాడ పోలీసులు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హత్య పట్ల పల్లె రఘునాథ్ రెడ్డి వ్యక్తం చేస్తూ నిందిథులను గుర్తించి, పట్టుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నల్లమాడ పోలీసులు తెలిపారు.
Also read
- నన్ను చంపాలని అనేకసార్లు ప్రయత్నించారు.. జోగి రమేష్ కోడలు మేఘన
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..





