నంద్యాల జిల్లా కోవెలకుంట్ల సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పని చేస్తున్న పలువురు పోలీసు అధికారుల ఫోటోలను అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. పోలీసుల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న కోవెలకుంట్ల పట్టణంలోని గాంధీనగర్ లో నివాసం ఉంటున్న తల్లి కూతురును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు
వివరాల ప్రకారం.. మార్తమ్మ, ఆమె కూతురు బందెల స్పందన.. ఉయ్యాలవాడ మండలం మాయలూరు గ్రామానికి చెందిన వారు.. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీరు కోవెలకుంట్ల పట్టణంలోని గాంధీ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఎందుకో ఏమో గాని వీరిద్దరూ పోలీస్ అధికారులను టార్గెట్ చేస్తూ.. యూనిఫాంలో ఉన్న పోలీస్ అధికారుల ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన రీతిలో ఫొటోలను ఎడిటింగ్ చేసేవారు.. ఆ తర్వాత ఆ ఫోటోలను వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ ,ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియాలలో పోస్టింగ్ చేస్తున్నారు.
తల్లికూతుళ్లు ఇద్దరూ గత కొన్నిరోజులుగా ఇదే విధంగా చేస్తుండటంతో.. పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. పోలీసులు ఎంత వారించినా వారు పద్ధతి మార్చుకోవడం లేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఓ కేసు వ్యవహారంలో వారికి న్యాయం జరగలేదని తరచూ పోలీస్ స్టేషన్ రావడం పోలీసులతో గొడవ పెట్టుకోవడం జరుగుతుందని.. పోలీసులు తెలిపారు
Also Read
- Mantralayam మానవత్వన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి…(video)
- 30వ ప్లోర్ నుంచి పార్క్ చేసిన కారుపై పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి.. షిఫ్టైన రెండ్రోజులకే
- Telangana: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపిన భార్య!
- మామ హత్య కోసం రూ.5 లక్షల సుపారి… పచ్చని సంసారంలో చెడు వ్యసనాల చిచ్చు..
- హైదరాబాద్లో దారుణం.. చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసిన రాక్షసుడు..





