హైదరాబాద్ నగరంలోని అల్వాల్‌లో స్విమ్మింగ్ చేస్తూ ఇంటర్ విద్యార్థిని మృత్యువాత పడింది. స్విమ్మింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. అల్వాల్‌లో ఉన్న VV స్విమ్మింగ్‌పూల్‌కి ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చింది వైష్ణవి. స్విమ్మింగ్ చేస్తూ ముగ్గురు అమ్మాయిలు పైకి రాగా.. వైష్ణవి మాత్రం లోపలే ఉండిపోయింది. అంతలోనే స్విమ్మింగ్ పూల్‌లో కుప్పకూలిపోయింది. అయితే, వైష్ణవి.. స్విమ్మింగ్‌పూల్‌లోనే ఉన్న విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో ఊహించని విషాదం జరిగింది.
15 నిమిషాల తర్వాత స్విమ్మింగ్‌పూల్ కోచ్ గమనించి పైకి తీసినప్పటికీ వైష్ణవి మృత్యువాతపడింది. స్పృహ కోల్పోయిన వైష్ణవిని ఆస్పత్రికి తరలించినా.. అయితే అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. శామీర్‌పేట్‌లోని ఓ కాలేజీలో వైష్ణవి ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఆదివారం (ఫిబ్రవరి 22) సాయంత్రం స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లింది. స్విమ్మింగ్ చేయడానికి పూల్‌కి వచ్చి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. ఊహించనివిధంగా వైష్ణవి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
అయితే, వైష్ణవి.. ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్‌పూల్‌లో పడి చనిపోయిందా..? లేక అనారోగ్య కారణాలా..? మరేదైనా కారణముందా అనేది తేలాల్సి ఉంది. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- డ్యామిట్ సీన్ రివర్స్.. లవర్‌పై పెట్రోల్ పోసి నప్పంటించే ప్రయత్నం.. కట్‌చేస్తే..
- Telangana: డబ్బులు కట్టి గోల్డ్ విడిపిద్దామని బ్యాంక్‌కు వచ్చాడు.. తీరా నగలు పరిశీలించగా
- సాయంత్రం వేళ స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
- నేటి జాతకములు 24 ఫిబ్రవరి, 2026
- కరీంనగర్ లో విషాదం: వారం వ్యవధిలో దంపతుల మృతి




