లోక కళ్యాణం, సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో తెగ హడావిడి, న్యూసెన్స్ క్రియేట్ చేసిన అఘోరీగా చెప్పుకునే ఓ వ్యక్తి.. ఓ యువతిని పెళ్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వారి వివాహానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే అఘోరీ శ్రీనివాస్‌పైన రకరకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అతని వ్యవహారంపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వివస్త్రగా తిరుగుతూ సంచలనం రేపిన లేడీ అఘోరీ అన్నంత పనీ చేసింది. తాను వివస్త్రగా తిరుగుతున్న సమయంలో బట్టలు అందించి సహకరించిన యువతి వర్షిణిని వివాహం చేసుకుని మరో సంచలనానికి తెరతీసింది. మధ్యప్రదేశ్ లోని ఓ ఆలయంలో అఘోరీ, వర్షిణీ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకుని, తలంబ్రాలు పోసుకుని, ఏడడుగులు నడిచారు. స్థానిక భక్తులు ఉత్సహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఏపీలోని నందిగామలో వర్షిణికి అఘోరీ పరిచయం అయింది. బీటెక్ చదువుకున్న వర్షిణి అఘోరీకి ఆకర్షితురాలైంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత అఘోరీ వర్షిణి ఇంట్లో కొన్నాళ్లు మకాం వేసింది. అక్కడ పూజలు కూడా చేసింది. అక్కడినుంచి వెళ్లిపోతూ వర్షిణిని కూడా వెంట తీసుకెళ్లింది అఘోరీ. తమ కుమార్తెకు లేనిపోని మాయమాటలు చెప్పి అఘోరీ తమ కుమార్తెను ఎత్తుకెళ్లిపోయాడని వర్షిణీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వర్షిణి తల్లిదండ్రులు గుజరాత్‌లో ఉన్న తమ కుమార్తెను అఘోరీ దగ్గర నుంచి తిరిగి తీసుకొచ్చారు. కొన్నాళ్లు తల్లిదండ్రులతో కలిసి బాగానే ఉంది వర్షిణి. కానీ అఘోరీని మర్చిపోలేకపోయింది. మళ్లీ ఇంటినుంచి పారిపోయింది. ఇప్పుడు అఘోరీ-వర్షిణి పెళ్లి చేసుకున్నట్టు నెట్టింట వీడియో వైరల్ అవుతోంది
Also read
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….
- ఇలా తయారయ్యారేంట్రా..! టీ చేతికి ఇవ్వలేదని ఇంత దారుణమా..?
- Crime News: నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే కనిపించిది చూసి..
- కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా.. తెగబడ్డ తెంపుడుగాళ్లు.. భయంతో వణుకుతున్న మహిళలు!
- సబ్‌రిజిస్ట్రార్ ఆస్తులు ఏకంగా రూ.100 కోట్లు.. ఏసీబీ వలకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం!





