చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. రెండు రోజుల క్రితమే ఆదిలాబాద్ రిమ్స్‌లో మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలోని మంజీరా ట్రినిటీ హోమ్స్ అపార్ట్మెంట్లో 13 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చదువుల ఒత్తిడి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. మార్కులు తక్కువ వచ్చాయని, టీచర్లు తిట్టారని, సరిగ్గా చదవడం లేదనే కారణాలతో ఇప్పటికే ఎంతోమంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. రెండు రోజుల క్రితమే ఆదిలాబాద్ రిమ్స్‌లో మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. మంజీరా ట్రినిటీ హోమ్స్ అపార్ట్మెంట్లో 13 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆకుల వెంకట లాస్య ప్రియ 17వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురువారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో జరిగింది.
లాస్య ప్రియ ఇటీవలే నిర్వహించిన పేరెంట్-టీచర్ మీటింగ్ కు తల్లిదండ్రులతో కలిసి హాజరైంది. అయితే సరిగ్గా చదవడం లేదని, మార్కులు తక్కువ వచ్చాయని టీచర్లు తల్లిదండ్రులతో చెప్పగా.. పేరెంట్స్ ఆమెను మందలించారు. దీంతో లాస్యప్రియ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం, పైగా తల్లిదండ్రుల మందలింపులతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనంగా నిలుస్తోంది. మార్కుల విషయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టీనేజ్ దశలో వారితో జాగ్రత్తగా మెలగాలని సూచిస్తున్నారు
Also read
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..





