వివాహేతర సంబంధం నేపథ్యంలో తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య మరో వ్యక్తితో ఏకాంతంగా ఉండటాన్ని చూసిన భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆవేశంలో భార్యతో పాటు ఆమెతో ఉన్న వ్యక్తిని హత్య చేసినట్లు సమాచారం. విరుదునగర్ జిల్లాలో జరిగిన ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా అరుప్పుకోటై సమీపంలోని పాళయంపట్టి గ్రామానికి చెందిన శరవణకుమార్కు పొన్నళగుతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన ఆనందరాజ్తో పొన్నళగుకు కొంతకాలంగా పరిచయం ఉన్నట్లు సమాచారం. ఆనందరాజ్కు కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యకు, ఆనందరాజ్కు మధ్య ఉన్న సంబంధం గురించి శరవణకుమార్కు తెలియడంతో గతంలోనే ఆమెను హెచ్చరించినట్లు తెలుస్తుంది.
అయినప్పటికీ వారిద్దరి మధ్య పరిచయం కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భార్య పొన్నళగు, ఆనందరాజ్ ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో శరవణకుమార్ అక్కడికి చేరుకున్నాడు. ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న కొడవలితో ఇద్దరిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు . అనంతరం రాయితోనూ దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అరుప్పుకోటై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు శరవణకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యలకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ గౌతమ్ గోయల్ వెల్లడించినట్లు తెలుస్తుంది ..
ఈ ఘటనలో పొన్నళగు మరణించడంతో ఆమె ముగ్గురు పిల్లలు తల్లిని కోల్పోయారు. మరోవైపు ఆనందరాజ్కు కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబాల్లో చోటుచేసుకున్న ఈ విషాదం స్థానికులను కలచివేసింది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల జీవితాలను ప్రభావితం చేసింది.
Also read
- పెళ్లి చేసుకుంటాడనుకుంది.. చివరకు!
- భార్యతో మరో వ్యక్తి.. భర్త దారుణం!
- పెళ్లి చేయలేదనీ.. పెట్రోల్ పోసి సొంత ఇంటికే నిప్పు పెట్టిన కొడుకు!
- రూమ్ అద్దె విషయంలో గొడవ.. రూ.100 కోసం యువకుడిని కొట్టి చంపిన లాడ్జి సిబ్బంది!
- విష్ణుమూర్తి తులసిని ఎందుకు వివాహం చేసుకున్నారు? తులసి కల్యాణం వెనకున్న కథ





