అమరావతి: విజయవాడ లబ్బీపేట ప్రాంతానికి ఓ సస్పెక్ట్ షీటర్ పేరుపోగు క్రాంతికుమార్ (40) గత నెల 21న విషగుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది, ఒక రోజు తర్వాత 22న చనిపోయాడు. అతను చనిపోయేముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తనను కృష్ణలంక సీఐ నాగరాజు తీవ్రంగా వేధిస్తున్నట్టు ఆ వీడియోలో బాధితుడు వాపోయాడు. ‘నా చావుకు కారణం సీఐ నాగరాజు. నన్ను వేటాడి వెంటాడి, వేధిస్తున్నారు. మూడు నెలల నుంచి కొడుతూనే ఉన్నారు. నేనింక బతకలేను. నా చావుకు కారణం ఆయనే. అందుకే గుళికల మందు తాగేస్తున్నా’ అని చెప్పి తన చేతిలో ఉన్న పౌడర్ మింగుతూ వీడియో తీసుకున్నాడు. అతనిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ.. మర్నాడు చనిపోయాడు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





