భర్త వేధింపులు భరించలేక భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణం చెందిన సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కొత్తపేట తొగటవీధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
గ్యాస్ సిలిండరుకు నిప్పంటించుకుని ఆత్మహత్య అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం
రాయచోటి, : భర్త వేధింపులు భరించలేక భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణం చెందిన సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కొత్తపేట తొగటవీధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. లక్కిరెడ్డిపల్లె మండలం బి. ఎర్రగుడి దళితవాడకు చెందిన రాజాకు గాలివీడు మండలం దానంరెడ్డిగారిపల్లి దళితవాడకు చెందిన రమాదేవి (34)తో పదేళ్ల కిందట వివాహమైంది. వారికి మనోహర్ (8), మన్విత (5) సంతానం. ఉపాధి కోసం దంపతులు ఐదేళ్ల కిందట గల్ఫ్ దేశాలకు వెళ్లారు. రెండేళ్ల కిందట ఇంటికి తిరిగొచ్చిన రమాదేవి పిల్లలతో కలిసి రాయచోటిలోని తొగటవీధిలొ ఉంటూ టైలరింగ్ చేసుకుంటూ పిల్లలను చదివిస్తోంది. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఇంటిలో మూడు సీసీ కెమెరాలు అమర్చాడు. ఆమెను వేధిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు గల్ఫ్ లో ఉన్న భర్తతో సెల్ఫోన్లో భార్య గొడవ పడ్డారు. తాను భర్త వేధింపులు భరించలేకున్నానని, చనిపోతున్నానని.. తన మృతదేహాన్ని భర్త తరపున వారికి ఇవ్వొద్దని రమాదేవి కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. శనివారం ఉదయం 7.30కు ఇంటిలో నుంచి పొగమంటలు బయటకు రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునేలోగా రమాదేవి, చిన్నారులు మనోహర్, మన్వితలు అగ్నికి ఆహుతయ్యారు. వంట గదిలోని గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి నిప్పంటించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి సోదరుడు నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త రాజాపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. సంఘటన స్థలాన్ని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాదొడ్డి, ఎస్పీ వి. విద్యాసాగర్నాయుడు పరిశీలించారు
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం