కామేపల్లి: ప్రేమ పేరుతో సహ విద్యార్థి వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన యువతి ఎలుకల నివారణ పేస్ట్ మింగి ఆత్మహత్యకు పాల్ప డింది. ఐదు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసింది. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్తలింగాల గ్రామానికి చెందిన పాలే యఫియా (21) ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డిప్లొమా చదువుతోంది. అదే కళాశాల విద్యార్థి సయ్యద్ అనాస్ కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నట్లు తెలిసింది.
అక్టోబర్ 23న ఆమె కాలేజీకి వెళ్లగా అనాస్ ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. దీంతో ఆమె 27న స్వగ్రామానికి వచ్చి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు మింగింది. గమనించిన కుటుంబీకులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా, పరిస్థితి విషమించి శనివారం మృతి చెందింది. ఘటనపై యఫియా తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- గే డేటింగ్ యాప్‌లో పరిచయం.. తియ్యని మాటలతో యువకుడి కొంపముంచిన కేటుగాడు..
- Cyber Fraud: పోలీసు కానిస్టేబుల్‌కే టోకరా.. రూ.29 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు.. సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు!
- హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
- Raptadu Case Update: హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై బిగ్ అప్డేట్
- వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే?





